కరోనా అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని విక్టరీ వెంకటేష్ అన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, మీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా ఇంటికే పరిమితం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం చెబుతున్న లాక్డౌన్ రూల్స్‌ని పాటించాలని తెలిపారు. ఇంట్లోనే వుండండి, సురక్షితంగా వుండండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. కోరోనాతో యుద్దం గెలిచి తీరాలంటే ఇంటికే పరిమితం కావాలన్నారు.