హోమ్ » వీడియోలు » సినిమా

Video : కరోనాపై పోరు.. 11లక్షలు విరాళం ప్రకటించిన సీనియర్ నరేష్..

సినిమా19:31 PM April 06, 2020

కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అంతేకాదు కరోనా మహామ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇప్పటికే జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశ ప్రజలు ఓసారి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు. తాజాగా నిన్నటి నిన్న దేశ ప్రజలందరు బీదా, గొప్పా అనే తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో  మా అధ్యక్షుడు నరేష్ తన వంతుగా రూ. 11 లక్షల విరాళం ప్రకటించారు. అందులో రూ. 10 లక్షల రూపాయలను 10 వేల మంది మా సభ్యులకు రూ. 10 వేల వంతున అందజేయనున్నట్టు ప్రకటించారు. వారికి కావాల్సిన నిత్యవసరాలతో పాటు మరికొన్ని అవసరాల కోసం రూ. 10 వేల వంతున నగదు సాయం చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు సినీ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 1 లక్ష విరాళం ప్రకటించారు. మొత్తానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమే అని చెప్పాలి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading