ఎప్పుడూ కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూడటమేనా..? అనుకున్నాడో ఏమో.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఎంచక్కా సైకిల్ ఎక్కి ముంబై రోడ్లపై పడ్డాడు. దబాంగ్-3 షూటింగ్ కోసం సల్మాన్ స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. ముంబై రోడ్లపై ఆయన్ను చూసిన జనం ఆశ్చర్యపోయారు. జోరు వానలో సల్మాన్ ఇలా సైకిల్‌పై వెళ్లడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనమంటున్నారు. సింప్లిసిటీయో.. మరొకటో కానీ.. సల్మాన్ మాత్రం సైకిల్ రైడ్‌ను బాగా ఎంజాయ్ చేశాడు.