Saaho: బాహుబలి సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా.. సాహో. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల అవుతోంది. అయితే, ఈ రోజు ఈ సినిమా ప్రమోషన్ మొదలైంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్, నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.