ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో జోరుమీదున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్... తాజాగా తన కొడుకు ఆకాష్‌తో రొమాంటిక్ సినిమా తీస్తున్నాడు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ అయితే... అనిల్ పాడూరి డైరెక్షన్ చేస్తున్నారు. సెట్లో షూటింగ్ జరుగుతున్న టైంలో... అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పొడవాటి గుడ్డకు మంటలు అంటుకున్నాయి. అవి వేగంగా వ్యాపించి, సెట్ మొత్తం తగలబడింది. ఐతే... మంటలు సెట్ మొత్తం వ్యాపిస్తాయని యూనిట్ సభ్యులు అనుకోలేదు. కానీ... వాళ్లు ఆ విషయం గ్రహించేలోపే నష్టం జరిగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.