ప్రభాస్ సరసన కథానాయికగా ఛాన్స్ అంటూ ‘రాహు’ సినిమా ఫేమ్ కృతి గార్గ్‌కు అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి ఫోన్ చేసినట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. ఆమెను ఆడిషన్ కోసం ముంబై రమ్మన్నాడు. దీంతో ఈ హీరోయిన్ పట్టలేని ఆనందంతో తనకు ఫోన్ చేసింది సందీప్ రెడ్డినా కాదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండానే ముంబై వెళ్లింది. వెళ్లే ముందు తనకు ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందంటూ.. తీరా ఆమె ముంబై వెళ్లిన తర్వాత సదరు కృతి గార్గ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్టు వస్తోంది. అయితే ఈ విషయమై రాహు సినిమా దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీసులకు కంప్లైట్ చేసాడు. అయితే ఈ విషయంపై హీరోయిన్ కృతి గార్గ్ స్పందించింది. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని, నేను క్షేమంగానే ఉన్నాయని తెలిపింది.