మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానులు అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌తో మీడియాతో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్... ‘జక్కన్నతో ఇది నాకు నాలుగో సినిమా. ఆయనతో సినిమా అంటే ఎంతో నమ్మకం, గుండె ధైర్యం వస్తాయి. అయితే మొదటిసారి ఎందుకో కాస్త భయంగా ఉంది. ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ సినిమా నా కెరీర్లో స్పెషల్ చిత్రంగా మిగిలిపోతుంది. నా కెరీర్లోనే కాదు రామ్‌చరణ్, జక్కన్న, దానయ్య అందరి కెరీర్లోనూ వన్ ఆఫ్ స్పెషల్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్నతో పాటు నా ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇప్పుడు మొదలైంది కాదు. నాకు ఇండస్ట్రీలో తెలిసిని మంచి స్నేహితుల్లో చరణ్ ఒకడు. నాకు కష్టం వచ్చినా, ఆనందం కలిగినా జక్కన్నతో పాటు రామ్‌చరణ్‌తో కూడా పంచుకుంటాను. ఈ సినిమా వల్ల మా మధ్య అనుబంధం మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. సినిమా విడుదలైన తర్వాత కూడా మేము ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా... ఎందుకంటే మంచి బంధాలు వచ్చినప్పుడే దిష్టం తగులుతుందని మా అమ్మ చెబుతూ ఉంటుంది. ఈ సినిమాకీ, మా మధ్య బంధానికి ఎప్పుడూ దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా...’ అని చెప్పుకొచ్చాడు ఎన్.టీ.ఆర్