Saaho : సూమారు 300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్ నేషనల్ లెవల్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తోన్న సాహో ఈ రోజు విడుదలైంది. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ సంగారెడ్డి పట్టణం నటరాజ్ థియేటర్లో సాహో సినిమాను చూసేందుకు థియేటర్ వద్ద బారులుతీరారు. అంతేకాకుండా కొందరు అభిమానులు ప్రభాస్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్నిచాటుకున్నారు. ‘సాహో’ ను సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు.