Saaho : బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో.. సూమారు 300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్ నేషనల్ లెవల్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తోంది. ఆగస్టు 30న విడుదలౌతోన్న ‘సాహో’ ను సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులు.. ఈ రోజు సినిమా విడుదలవుతుండడంతో
థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.