రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్దాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా బెనిఫిట్ షో వేయలేదన్న కారణంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సాహో సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. ఫ్యాన్స్ ఆగ్రహానికి సంబంధించిన ఈ వీడియో వైరల్గా మారింది.