Saaho : సూమారు 300 కోట్ల బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ సాహో ఈ రోజు విడుదలైంది. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ సంగారెడ్డి పట్టణం నటరాజ్ థియేటర్లో సాహో సినిమాను చూసేందుకు థియేటర్ వద్ద బారులుతీరారు. కాగా ప్రభాస్ అభిమానుల్లో ఒకరు తన చేయిని కొసుకుని రక్తంతో ప్రభాస్ పోస్టర్‌కు రక్త తిలకం దిద్దాడు.