తన సినిమా వివాదంపై పోసాని కృష్ణమురళి స్పందించారు. సినిమా కథ, టైటిల్‌ని ఇంకా ఎవరికీ చెప్పలేదని... టీడీపీ కార్యకర్త ఆరోపణలను ఈసీ గుడ్డిగా ఎలా నమ్ముంతుందని విమర్శించారు. తనకు ఈసీ నోటీసులు పంపించడంపై ఆయన మండిపడ్డారు. సినిమా వాళ్ల జీవితాలను నాశనం చేయాలని అనుకుంటున్నారా? టీడీపీ గెలవాలని ఈసీ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.