Bigg Boss 3 : ఇంకొన్ని గంటల్లో బిగ్ బాస్ షో మొదలు కానున్న సమయాన.. బిగ్ బాస్ చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు.. షో నిర్వాహకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ల కేసుల పుణ్యమా అని చాలా వివాదాలకు బిగ్ బాస్ షో కేంద్ర బిందువు అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఈ షోపై కేసు కూడా ఫైల్ చేసాడు. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ ఆయన తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఓయూ విధ్యార్థులు కూడా దీనిపై కన్నెర్ర చేస్తూ.. బిగ్ బాస్ షో ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా బిగ్ బాస్ షోని నిలుపుదలచేయాలంటూ ఉస్మానియా విద్యార్థులు యూనివర్శిటీ నుండి బయలుదేరి.. బంజారా హిల్స్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుని.. అక్కడి నుండి తరలించారు.