ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగమైన "కథానాయకుడు"పై తనదైన శైలిలో స్పందించారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ మొత్తం జీవితాన్ని ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టలేమన్న ఆమె... అది అనితర సాధ్యమన్నారు. బయోపిక్‌లో తనను తప్పుగా చూపిస్తే ఒప్పుకునేది లేదన్న ఆమె... సినిమా చూడమని తనకు కనీసం ఆహ్వానం కూడా రాలేదన్నారు.