మరికొన్ని గంటల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ థియేటర్స్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈచిత్ర కథానాయకుడు బాలకృష్ణతో పాటు కథానాయికగా నటించిన విద్యాబాలన్, సుమంత్ సహా పలువురు టీమ్ మెంబర్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్స్లో 100ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. అందులో భాగంగా తిరుపతిలోని పీజేఆర్ థియేటర్లో సందడి చేశారు. ఈ సందర్భంగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.