ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..మహానటుడు దివంగత ఎన్టీఆర్ 23వ వర్థంతి పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఉదయమే ఘాట్ వద్ద నివాళి అర్పించి అన్నగారికి అంజలి ఘటించారు. మరోవైపు ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని ఘనంగా నివాళులు అర్పించి తండ్రి గొప్పతతాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.