హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, విలన్ వేషాలతో పాపులారిటీ తెచ్చుకుంది సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ. తాజాగా విడుదలైన ‘పందెం కోడి 2’, ‘సర్కార్’ సినిమాల్లో విలనీ వేషాలు వేసి కోలీవుడ్ జనాలను మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ వయసు 33 ఏళ్లు. ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడని మాటిమాటికీ అడిగి విసిగిస్తుండడంతో ‘పెళ్లి చేసుకోవడం శుద్ధ టైమ్ వేస్ట్ పని’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మీ. పురుషుల్లాగే మహిళలూ ఒంటరిగా ఉండగలరంటూ కామెంట్ చేసింది హీరో విశాల్ గర్ల్‌ఫ్రెండ్...