బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘మణికర్ణిక’. అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో బయటికి వచ్చింది. ఇందులో కంగన పరికరాలు అమర్చిన డమ్మీ గుర్రంపై సవారీ చేస్తుంటే.. ఆమె సైనికులు (సినిమాలో) నిజమైన గుర్రంపై సవారీ చేస్తూ కనిపించారు.