బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ చెల్లెల్లిగా బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన సోహా అలీ ఖాన్... కొద్దికాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంది. హాట్ హాట్ బికినీల్లో కనిపించేందుకు కూడా వెనకాడని ఈ హీరోయిన్ కొన్నాళ్ల కిందట హీరో కునాల్ కెమ్మూని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా స్లిమ్‌గా, గ్లామరస్‌గా ఉండే సోహా... ‘ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతీ హీరోయిన్ మేకప్ వేసుకోవాల్సిందే...’ అంటూ వ్యాఖ్యానించింది.