హోమ్ » వీడియోలు » సినిమా

Video: పెనిమిటీ... పాట పాడిన రామజోగయ్య శాస్త్రి

సినిమా22:15 PM September 21, 2018

ఎన్.టీ.ఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఢీజే భామ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఈ మధ్యనే విడుదలయ్యాయి. ముఖ్యంగా ‘పెనిమిటీ...’ అంటూ సాగే పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. తాను రాసిన పాటకు వస్తున్న స్పందన చూసి, ఆనందానికి లోనైన పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి... స్వయంగా పాట పాడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో తారక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Chinthakindhi.Ramu