HOME » VIDEOS » Movies » KEERTHY SURESH ACCEPTED GREEN INDIA CHALLENGE AND PLANTING SAPLINGS TA

Video:గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కీర్తి సురేష్..

సినిమా20:19 PM February 09, 2020

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్ సూరారం లోని టెక్ మహీంద్ర కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు  మహానటి సినిమాతో జాతీయ ఉత్తమనటి అవార్డును అందుకున్న కీర్తి సురేష్.  ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలను నాటే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాలాగే నా అభిమానులతో పాటు పర్యావరణం కాపాడుకోవాలనే సృహ ఉన్న ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుందన్నారు.  ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

webtech_news18

Top Stories