Bigg Boss 3 : బిగ్‌బాస్ సీజన్ 3 ప్రసారం కాకముందే వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సంచలన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది బిగ్ బాస్ 3 షో. ఈ షోపై ఇప్పటికే శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. మరోవైపు ఈ రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇదిలావుంటే మరోవైపు ఈ షో పై ఓయూ విద్యార్థి సంఘాలు కూడా కనెర్ర చేసాయి. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఢిల్లీలోని నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ ఆశ్రయించి ... ఈ షోను ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదు కమీషన్ స్వీకరించిందని.. ఆ వీడియోలో పేర్కోన్నారు.