కామారెడ్డి జిల్లాలో సినిమా షూటింగ్ సందడిగా మారింది. జిల్లాలోని బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్, నెమలి గ్రామాల పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో సీనియర్ హీరో వినోద్ కుమార్, జబర్దస్త్ ఫేమ్ చంటి పాల్గొంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ చూడడానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు తరలి రావడంతో సందడిగా మారింది.