బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ప్రస్తుతం సినిమాలకు కాసేపు విరామం ఇచ్చి విహార యాత్రలో ఉన్నారు. తన కొడుకులతో కలిసి స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ప్రస్తుతం ‘సూపర్ 30’ పేరుతో రూపొందుతున్న మేథమేటిషన్ ఆనంద్ కుమార్ బయోపిక్‌లో నటిస్తున్న హృతిక్ రోషన్, ఈ సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చేసుకున్న విషయం తెలిసిందే.