టాలీవుడ్ నటుడు నాగశౌర్యకు యాక్సిడెంట్ అయ్యింది. ఇది రోడ్డు మీద జరిగిన ప్రమాదం కాదు. షూటింగ్ సెట్లో జరిగినది. నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు రమణ తేజతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో డూప్ లేకుండా రోప్ వాడకుండా నాగశౌర్య రియల్ స్టంట్ చేస్తున్నాడు. ఆ సమయంలో కాలికి గాయం అయింది. అది కూడా తీవ్రంగా కావడంతో చిత్రయూనిట్ కంగారు పడుతున్నారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు 25 రోజుల రెస్ట్ అవసరం అన్నారు. షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది.