డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హీరో విజయ్ దేవరకండ సౌత్ స్టేట్స్లో కామ్రేడ్ మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా బెంగళూరు,కొచ్చిలో ఇటీవలే ఈవెంట్ పూర్తి చేశాడు. ఈవెంట్ సందర్భంగా అభిమానులు పోటెత్తడంతో అదుపు చేయడం ఎవరి వల్లా కాలేదు. మ్యూజికల్ ఈవెంట్స్‌కు తమకు పాసులు దొరకలేదని కొంతమంది ఫ్యాన్స్ నిరసనకు కూడా దిగారు. విషయం తెలిసిన దేవరకొండ బయటకొచ్చి ఫ్యాన్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అమ్మాయి విజయ్ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకోగా ఆమెను ఓదార్చాడు.