అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అది అలా ఉంటే.. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హరిత హారంలో భాగంగా మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ను అనసూయ స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా శనివారం కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు.