రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా అసలు సిసలైన హీరోగా ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. గతంలో మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల లోన్స్‌ను మాఫీ చేయించి తన పెద్ద మనసును చాటుకున్న అమితాబ్.... తాజగా ఉత్తరప్రదేశ్‌లో అప్పులతో బాధపడుతున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచి వాళ్ల రుణాలను చెల్లించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను మహారాష్ట్రలోని ఒక ఎన్.జీ.ఓ శాయాజీ రత్న అవార్డుతో సత్కరించింది.