అల వైకుంఠపుమురములో సినిమా టీమ్ సభ్యులు త్రివిక్రమ్, అల్లు అర్జున్ దంపతులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.