హోమ్ » వీడియోలు » సినిమా

#bottlecapchallenge : కాలితో సీసా మూతల్నీ తీస్తున్న అక్షయ్ కుమార్

సినిమా15:59 PM July 03, 2019

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఛాలెంజ్‌లు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతాయి. కొన్నాళ్ల క్రితం నెటిజన్స్ ఐస్ బకెట్ చాలెంజ్ అని..కొన్ని రోజులు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత 'కీకీ ఛాలెంజ్‌' పేరుతో రకరకాల విన్యాసాలు చేశారు. రోడ్లపై డ్యాన్సులు చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేశారు. చివరకు సినిమా స్టార్స్ కూడా అదే బాట పట్టారు. ఇప్పటికీ అలాంటి వెరైటీ ఛాలెంజెస్ ఇంటర్నెట్‌లో కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది. అదే 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'. ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన వారు..సీసా మూతల్నీ కాలితో తీయాలి. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. తన వంతుగా ఓ విన్యాసం చేసి బాటిల్ మూతను తీశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18