దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న రఫేల్ డీల్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ డీల్‌లో ఎలాంటి అవినీతీ జరగలేదంటూ మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్.. డీల్‌కు సంబంధించిన డాక్యమెంట్స్ రక్షణశాఖ నుంచి దొంగిలించబడ్డాయని తెలిపారు.