హోమ్ » వీడియోలు » సినిమా

ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్.. కన్ఫామ్ చేస్తూ ఓ వీడియో విడుదల

సినిమా15:43 PM July 10, 2019

మిగిలిన హీరోల‌తో పోలిస్తే సోష‌ల్ మీడియాను త‌క్కువ‌గా ఫాలో అయ్యే హీరో రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే. ఈయ‌న‌కు క‌నీసం ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా లేదు. ఫేస్ బుక్‌లోనే ఇప్ప‌టికీ త‌న సినిమా ముచ్చ‌ట్లు చెబుతుంటాడు మెగా వార‌సుడు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టాడు చరణ్.. always ram charan పేరుతో త‌న ఖాతాను ఓపెన్ చేసాడు. అందులో భాగంగా తాను ఇన్‌స్టాలో ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశాడు. ఇప్పటికే రెండు లక్షలకుపైగా రామ్ చరణ్‌ను ఫాలో అవుతున్నారు. గంటగంట‌కు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఇక త‌న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మార్చేసిన లుక్ ఇందులో విడుద‌ల చేసాడు రామ్ చ‌ర‌ణ్. ప్ర‌స్తుతానికి అయితే ఇన్‌స్టాలో చ‌ర‌ణ్ ఎవ‌ర్నీ ఫాలో కావ‌డం లేదు. మొత్తానికి చ‌ర‌ణ్ కూడా అప్ డేట్ కావ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు.

webtech_news18