హోమ్ » వీడియోలు » సినిమా

Video: గిన్నీస్ రికార్డ్ కోసం లండన్‌లో స్వర వీణాపాణి సాధన

సినిమా20:42 PM October 01, 2019

మిథునం, దేవస్థానం, పట్టుకోండి చూద్దాం వంటి విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించి అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుస్వర బ్రహ్మ స్వరవీణాపాణి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. 63 గంటల పాటు ఏకధాటిగా సంగీత సాధనాలను ప్లే చేస్తూ చరిత్ర సృష్టించేందుకు కష్టపడుతున్నారు. లండన్ వేదికగా మౌంట్ బాటన్ హాలులో కొనసాగుతున్న సుస్వర వీణాపాణి మారథాన్ ప్లేయింగ్ ఇప్పటి వరకు 35 గంటలు దాటింది. గంటల తరబడి ప్లే చేయడం మామూలు విషయం కాదు. ఏకాగ్రత, మానసిక సంసిద్ధత, పట్టుదల, శారీరక పటుత్వం వంటి అంశాలెన్నో ప్రభావితం చేస్తాయి. వీణాపాణి వీటన్నింటినీ అలవోకగా అధిగమించి తన లక్ష్యం వైపు పయనిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading