మేఘాలయ రాజధాని షిల్లాంగ్ గులాబీమయంగా మారిపోయింది. చెర్రీపూలు విచ్చుకోవడంతో తూర్పున ఉన్న కొండలు గులాబీవర్ణంలో కనువిందు చేస్తున్నాయి. హిమాలయ ప్రాంతానికి చెందిన చెర్రీ వృక్షాలు షిల్లాంగ్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ సీజన్ వచ్చేసరికి చెర్రీ పూలు పూయడం, ఆ ప్రాంతమంతా గులాబీ వర్ణంలో కనిపించడం పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు తెచ్చుకున్న షిల్లాంగ్లో పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు మేఘాలయ ప్రభుత్వం చెర్రీపూల పండుగ నిర్వహిస్తోంది. 3వ అంతర్జాతీయ చెర్రీపూల పండుగ నవంబర్ 14-17 వరకు జరగనుంది. చెర్రీ చెట్లపై తెలుపు, గులాబీ రంగుల పూవులు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.