హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

VIDEO: గుండె కోసం మర్చిపోవాల్సిన ఆరు ఆహారపదార్థాలు

లైఫ్ స్టైల్09:19 AM September 29, 2018

ఒకప్పుడు గుండె జబ్బులంటే పెద్ద వయస్సువాళ్లలోనే చూసేవాళ్లం. కానీ... ఇప్పుడు యువకులు సైతం గుండె జబ్బులతో చనిపోతున్నారు. హృదయ సమస్యలు రాత్రికి రాత్రే వచ్చేవి కావు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే రోజులు గడుస్తున్నకొద్దీ మీ గుండె ప్రమాదంలో పడిపోతుంది. ముఖ్యంగా సోడా, చిప్స్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ లాంటి ఆహారపదార్థాలతో గుండెకు ముప్పే. మొదట రక్తపోటు, అధిక కొవ్వు, డయాబెటిస్, ఊబకాయం లాంటి సమస్యలతో మొదలై చివరకు గుండెజబ్బులకు కారణమయ్యే ఆహార పదార్థాలెన్నో ఉన్నాయి.  వాటిలో కనీసం ఈ ఆరు పదార్థాలను వదిలేస్తే మీ గుండెను కాపాడుకోవచ్చు.

webtech_news18