HOME » VIDEOS » Life-style

Video: పసందైన చేపల విందు..హైదరాబాద్‌లో ఫిష్ ఫెస్టివల్

తెలంగాణ21:59 PM January 24, 2019

వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఫిష్ ఫెస్టివల్ జరగబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నేషనల్ ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. పలు రెస్టారెంట్లు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపారవేత్తలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. మొత్తం 20 స్టాళ్లలో నోరూరించే చేపల వంటకాలు, సంప్రదాయ రుచులు, ఫ్రోజెన్ సీ ఫుడ్, ఎండు చేపలు, రెడీ టూ ఈట్ ఫిష్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇలా చేపలకు సంబంధించిన అన్ని రకాల డిష్‌లు అక్కడ లభిస్తాయి. డబ్బులు చెల్లించి నచ్చిన వంటకాన్ని ఎంచక్కా లాంగించేయొచ్చు. ఈ ఫిష్ ఫెస్టివల్‌లో NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిణి ముఖ్య అతిథి హాజరవుతారు. తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ సి.సువర్ణ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. పలు మార్కెట్లు, జనావాస ప్రాంతాల్లోనూ మొబైల్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.

webtech_news18

Top Stories