కరీంనగర్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న పురాతన వెస్లీ కెథిడ్రల్ చర్చీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవ మత ప్రార్థనలతో పాటు జగిత్యాలలో మిషన్ హాస్పిటల్, బాలికల శిక్షణ పాఠశాల, జీటిఎస్ నర్సింగ్ ట్రైనింగ్ పాఠశాల ఐటీఐ సెంటర్, సీఎస్ఐ హైస్కూల్, బిషప్ సాలమన్ జూనియర్ కళాశాలలు... ఇలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఈ చర్చికీ శతాబ్దాల చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్బంగా వేలాదిగా క్రైస్తవులు ఈ చర్చిని దర్శించుకున్నారు.