హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

ప్రాచీన గ్రామీణ జానపద కళారూపం...జడకొప్పు కోలాటం...

తెలంగాణ17:02 PM November 13, 2019

ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో జడకొప్పు కోలాటంతో సందడి నెలకొంది. దీపావళి అమావాస్య నుండి కార్తీక మాసం వరకు ఈ జడ కొప్పు కోలాటాన్ని ఎంతో నిష్టతో ప్రదర్శిస్తుంటారు. పాడిపంటలు బాగుండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ జడకొప్పులాట ఆడుతుంటారని కళాకారులు చెబుతున్నారు. 16 మంది గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ, కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఒక చేత్తో చీరను పట్టుకొని, మరోచేత్తో కోలాలు వేస్తూ నృత్యం చేస్తూ జడలు అల్లడం ఈ నృత్యం ప్రత్యేకత. ఇందులో లక్ష్మీ జడ, సీత జడ, గుమ్మి జడ, తడక జడ, హారతి జడ అనే ఐదు రకాల జడలు ఉంటాయి. నృత్యం చేస్తూనే జడను అల్లి ఆతర్వాత విప్పుతుంటారు. ఇలా ఒక్కో జడకు కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఈ సందర్భంగా పాడే పాటలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రాధకృష్ణులు, లేక రుక్మిణి లేక కృష్ణుడు గోపికల మధ్య జరిగే సరస సంవాదం ఈ పాటల్లో ప్రతిధ్వనిస్తుంది. అయితే ఈ ఆట తెలిసిన గ్రామీణులకు వయసు మీదపడటంతో , కొత్తగా నేర్చుకునేందుకు యువత ముందుకు రాకపోవడంతో ఈ ఆట కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులలో ఈ కళ కు జీవం పోసి భావి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading