Health Tips | మంచినీరు ఆరోగ్యానికి చాలామంచిది. రోజుకు ఎంత వీలైతే అంత నీరు తాగండి.. ఆరోగ్యంగా ఉండండని చెబుతారు. దీంతో.. చాలామంది నీటిని తాగుతున్నారు. అయితే, ఈ నీరు కూడా చల్లగా ఉన్ననీటినే ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యం ఎండాకాలంలో అయితే, అప్పుడే ఫ్రిజ్లో నుంచి తీసిన నీరు.. గడ్డకట్టుకుపోయిన నీటిని తాగుతుంటారు. ఇలా మరీ చల్లగా ఉన్న నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.