దేశ యువతకు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రత్యేక సందేశం ఇచ్చారు. యువకులు తమ ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి ఏదైనా ఆటలు ఆడడం, శారీరక వ్యాయామం మొదలుపెట్టాలని సూచించారు. నేతి యువత బయటకు వెళ్లి ఆడుకోకుండా గాడ్జెట్లు తదితరాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు మీరు హాబీగా మొదలుపెడితే...అదే ప్రొఫషన్గా మారే అవకాశం ఉందన్నారు. క్రీడాకారుడు కాకపోయినా... ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఇది ఎంతో దోహదపడుతుందని కుంబ్లే అన్నారు.