Karthikeya 2 : నిఖిల్ సిద్ధార్ధ్ తెలుగులో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న చిన్న హీరో. ఈయన సినిమా వస్తుందంటే తెలుగు ఆడియన్స్ కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితి. అలాంటిది ఈయన నటించిన తాజాగా చిత్రం ‘కార్తికేయ 2’ సినిమా ఇపుడు తెలుగులోనే కాదు.. హిందీ మాట్లాడే నార్త్ బెల్ట్‌లో రోజుకు రోజుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అక్కడ ప్రేక్షకులు ఆమీర్, అక్షయ్ వంటి స్టార్స్ సినిమా కాదని కార్తికేయ 2 చూడటానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.