షిమ్లాలో మంచు భారీగా కురుస్తోంది. టెంపరేచర్ రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. హిమాలయాల పరిసరాల్లోని ధర్మశాల మంచుదుప్పటి కప్పుకుంది. షిమ్లా, మనాలీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచుతో స్థానికులు వణికిపోతున్నారు. వాతావరణం కనిష్ట స్థాయికి చేరుకుంది. టూరిస్ట్ స్పాట్స్ అయిన షిమ్లా, కుఫ్రీ, ఫాగు, నర్కండ ప్రాంతాల్లో విపరీతింగా మంచుకు కురుస్తోంది.