టూత్ బ్రష్ పుట్టుపూర్వోత్తరాల వెనుక చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనీయులే టూత్ బ్రష్‌ను ఆవిష్కరించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే క్రీ.పూ.5వ శతాబ్దంలోనే ఈజిప్షియన్లు టూత్ బ్రష్‌ను వినియోగించారన్న ప్రచారం కూడా ఉంది. మనిషి తొలుత తన కుడి చేతి చూపుడు వేలు ద్వారానే దంతాలను శుభ్రం చేసుకున్నాడని.. కాలక్రమంలో జంతువుల ఎముకలు, పక్షుల ఈకలు, చెట్ల బెరడ్లు, వేప పుల్లలు వంటివి వినియోగంలోకి వచ్చాయని పరిశోధనలు చెబుతున్నాయి.