కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్‌గా వస్తుంటాయి. కానీ వాటిలో చాలా విషయం ఉంటుంది. అలాంటి సినిమానే విటమిన్ షి. లాక్ డౌన్ సమయంలో చాలా మంది దర్శకులు ఇంట్లోనే కూర్చుని తమను తాను నిరూపించుకోడానికి కొత్త కథలు సిద్ధం చేసుకున్నారు. అందులో జయశంకర్ కూడా ఉన్నాడు. మూడేళ్ల కింద సంతోష్ శోభన్‌తో పేపర్ బాయ్ సినిమా చేసిన ఈ దర్శకుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు విటమిన్ షి అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..