Health Tips | మహిళలు గర్భసమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటుండాలి. ఈ సమయంలో ఎంతగా కేర్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు, తన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నారింజపండు జ్యూస్. ఈ జ్యూస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.