ఉల్లి చేసే మేలు, తల్లి కూడా చేయదంటారు. అయితే కత్తిరించి, నిల్వ చేసిన ఉల్లిపాయలు ఆరోగ్యానికి హాని చేస్తాయంటూ సోషల్ మీడియాలో ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. కత్తిరించి, నిల్వచేయడం వల్ల ఉల్లిపాయలు విషతుల్యం అవుతాయని, వాటిని ఆహారంలో వాడితో ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశారు ఆరోగ్య నిపుణులు. అసలు నిజమేమిటంటే...కత్తిరించి, నిల్వచేసిన ఉల్లిపాయల్లో ఎలాంటి హానికర బాక్టీరియా చేరదట. కాబట్టి ఎలాంటి భయం, బెరుకూ లేకుండా కోసి, ఫ్రిజ్లో పెట్టిన ఉల్లి ముక్కలను కూరలో వాడుకోవచ్చుట.