Papaya Health Benefits: బొప్పాయి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. భోజనం చేశాక ఓ బొప్పాయి ముక్క తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు అరికట్టేందుకు బొప్పాయి ఎంతగానో దోహద పడుతుంది. బొప్పాయి ఆకులతో చేసిన జ్యూస్ తాగితే ప్లేట్లేట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. బొప్పాయి ఆకుల్ని మెత్తగా దంచి పసుపుతో కలిపి పట్టువేస్తే బోధకాలు కూడా తగ్గుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. బొప్పాయి ఆకుల్లో సీ, ఏ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.