నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్.. వ్యవసాయానికి మారుపేరుగా నిలుస్తోంది. పంటల సాగులోనే కాదు వంటల్లోనూ మేమే నంబర్ వన్ అంటోంది. యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నాటుకోళ్లను ఎక్కువగా తినేవారు. అయితే వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపే రైతు కుటుంబాల వారికి కోడి కూర వండుకు తినేందుకు సమయం దొరికేది కాదు. ఇలాంటి వారి కోసమే కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టాడు ఓ వ్యక్తి... తన చికెన్ సెంటర్ లోని దేశీ కోడిని వండి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ ఐడియాకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కొద్ది రోజుల్లో చికెన్ తో పాటు రైస్ కూడా జత కలిపాడు. ఇక చాలామంది రైతులు ఆర్డర్లు బుక్ చేసి పార్సల్ తీసుకెళ్లడం ప్రారంభించారు. నాటుకోడి చికెన్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి.. అంకాపూర్ చికెన్ పేరుతో మరికొన్ని సెంటర్లు వెలిశాయి. పక్కనే ఉన్న ఆర్మూర్, మామిడిపల్లి, జక్రాన్ పల్లి, పెర్కిట్ లోని అంకాపూర్ చికెన్ అందుబాటులోకి వచ్చింది.