మెంతులు... ప్రతి ఇంట్లో తప్పక కనిపించే దినుసుల్లో ఒకటి. ఊరగాయల్లో, చారు,పులుసు, కొన్ని కూరల్లో మెంతులను వాడతారు. మెంతి పొడి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెంతులు తరుచూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. మెంతుల్లో ఉండే పోషకాలు, వృద్ధ్యాపంలో వచ్చే కీళ్ల సమస్యను దూరం చేస్తుందని శాస్త్రీయంగా తేల్చారు పరిశోధకులు.