Chiranjeevi 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి. గాడ్ ఫాదర్ దసరాకు రిలీజ్ కానుంది. కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్స్, అప్ డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ 154 సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ లాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.